: అమెరికా పర్యటన బృందంలో లోకేష్ పేరు తొలగింపు!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఆయన వెంట మంత్రుల బృందం కూడా వెళ్లనుంది. అయితే, అమెరికా వెళ్లే మంత్రుల బృందం జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జాబితాలో మంత్రి నారా లోకేష్ పేరును తొలగించారు. లోకేష్ పేరు మినహాయించి 15 మంది సభ్యుల బృందం అమెరికా వెళ్లనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా, ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు చంద్రబాబునాయుడు సహా మంత్రుల బృందం అమెరికాలో పర్యటించనుంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా తదితర నగరాల్లో పర్యటించి అధికారులతో చర్చలు జరపనున్నారు.