: గూగుల్‌లో ఆంధ్రపప్పు అని సెర్చ్ చేస్తే మంత్రి లోకేశ్ పేరు వచ్చేస్తోంది: వైసీపీ నేత జోగి రమేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేశ్ సెటైర్లు వేశారు. బీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కూడా లోకేశ్‌కు తేడా తెలియదని ఆయన అన్నారు. గూగుల్‌లో 'ఆంధ్ర పప్పు' అని కొడితే లోకేశ్ పేరు వచ్చేస్తోందని ఆయన అన్నారు. లోకేశ్ ను పప్పు అని పేర్కొన్నందుకు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ మాట తాను అనడం కాదని, గూగుల్లోనే అలా వస్తుందని అన్నారు. మరి ఈ విషయం గూగుల్ వాళ్లకి ఎవరు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు 'ఆంధ్రపులి' అని సెర్చ్ చేస్తే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు వస్తుందని ఆయన అన్నారు. టీడీపీలో ఓ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్ ఉందని అంటున్నారని, మరో ఎమ్మెల్యే బీకామ్‌లో సీఈసీ ఉంటుందన్నారని ఆయన ఎద్దేవా చేశారు.