: దిగ్విజయ్ కు అప్పుడప్పుడు మైండ్ పనిచేయదు: మంత్రి నాయిని


తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై మంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లేనని, ఆ పార్టీ నేత దిగ్విజయ్ కి అప్పుడప్పుడు మైండ్ పని చేయదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని, చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. 2014లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవాలని అనుకున్నామని, అయితే, జైరాం రమేష్, దిగ్విజయ్ వల్లే పొత్తు కుదరలేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు లేకపోవడానికి ముఖ్యకారకులు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగేనని ఆరోపించారు.

  • Loading...

More Telugu News