: నిమ్మరసం ఇచ్చిన రైతు... దీక్ష విరమించిన జగన్!
రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ నిన్న గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన ఈ రోజు మధ్యాహ్నం దీక్షను విరమించారు. ఆయనకు నిమ్మరసం ఇచ్చిన అక్కడి ఓ రైతు జగన్ తో దీక్ష విరమింపజేశారు. తన దీక్షకు మద్దతు తెలిపిన వారందరికీ జగన్ ధన్యవాదాలు చెప్పారు. తాను చేస్తోన్న దీక్షకు మద్దతుగా ఎండల్ని సైతం లెక్కచేయకుండా రైతులు వచ్చారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను రాష్ట్ర సర్కారు ఏ మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.