: 10 కోట్ల బ్యాంక్ ఖాతాల వివరాలు, 14 కోట్ల ఆధార్ నంబర్ల లీక్
మన భద్రతా వ్యవస్థలోని డొల్లతనం మరోసారి బయటపడింది. సుమారు 14 కోట్ల ఆధార్ కార్డులు, 10 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్ అయిందే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సంస్థ విడుదల చేసిన తాజా పరిశోధనా నివేదిక ప్రకారం... గత రెండు నెలల్లో భారీ ఎత్తున డేటా లీక్ అయింది. కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారహిత సమాచార భద్రతా పద్ధతుల వల్లే కీలకమైన సమాచారం బహిర్గతమైందని నివేదిక వెల్లడించింది.