: మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం.. సహకరిస్తోన్న లండన్ న్యాయవాదులు


భారతీయ బ్యాంకుల్లో దాదాపు 9000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండ‌న్‌లో త‌ల‌దాచుకుంటున్న పారిశ్రామిక వేత్త‌ విజయ్ మాల్యాను ఇటీవ‌లే అక్క‌డి పోలీసులు అరెస్టు చేయగా, న్యాయస్థానం బెయిలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌ను భారత్‌కు తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మ‌రం అయ్యాయి. ఈ క్రమంలో ఈడీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సీనియర్ అధికారుల ప్రత్యేక టీమ్‌ లండన్‌ చేరుకుంది.

మాల్యా విష‌య‌మై అక్కడి బ్రిటిష్‌ న్యాయవాదులతో వారు చ‌ర్చించ‌నున్నారు. మాల్యాను భార‌త్‌కు తిరిగి తీసుకు వచ్చేందుకు లండన్‌ విచారణ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. లండన్‌లో మాల్యాను అరెస్ట్ చేసినప్పటినుంచి సీబీఐ, ఈడీ, బ్రిటిష్‌ న్యాయవాదులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తున్నారు. విజయ్ మాల్యా కేసు ఈ నెల‌ 17న మ‌రోసారి లండన్ కోర్టులో విచారణకు రానుంది.

  • Loading...

More Telugu News