: ప్రియాంక వేసుకున్న ఆ డ్రెస్ నెటిజన్లకు నచ్చట్లేదు.. జోకులే జోకులు!
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి ప్రవేశించి అదరగొడుతున్న నటి ప్రియాంక చోప్రా తాజాగా న్యూయార్క్‌లో జరిగిన 'మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్'లో పాల్గొంది. ఈ సందర్భంగా ఈ అమ్మడు వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏంటీ, ప్రియాంక ఇలాంటి డ్రెస్ వేసుకుందంటూ అభిమానులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
ఈ ఈవెంట్లో ప్రియాంక రాల్ఫ్ లౌరేన్ బ్రాండ్‌కి చెందిన బ్రౌన్ రంగు ట్రెంచ్ కోట్ వేసుకుని సందడి చేసింది. కానీ ఆ డ్రెస్ ముందంతా బాగానే ఉంది కానీ, వెనుక మాత్రం పెద్ద దుప్పటి పరిచినట్లు వేలాడుతూ ఉండడంతో ఆ డ్రెస్ పై నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. ప్రియాంక వేసుకున్న డ్రెస్‌తో ఓ మైదానాన్నంతా కప్పేయవచ్చని కొందరు... ఇంత పెద్ద డ్రెస్‌ను టెంట్ లా ఉపయోగించుకోవచ్చని, గుడారాలు వేసుకోవచ్చని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.