: ఆర్టికల్ 371 డీ ప్రకారం చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాని కేటీఆర్: రేవంత్ రెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆర్టికల్ 371 డీ ప్రకారం, కేటీఆర్ చప్రాసీ ఉద్యోగం చేసేందుకు కూడా అనర్హుడని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఏమీ చేయలేని కేటీఆర్, ఉదయం ట్విట్టర్, సాయంత్రం క్యాట్ వాక్ తో సరిపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, తెలంగాణ ద్రోహులకు రాజకీయ ఉద్యోగాలు ఇవ్వడం మినహా ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. తమ పొట్ట కొడుతున్నారన్న కోపంతోనే విద్యార్థులు 'ఉమ్మడి రాష్ట్రం ముద్దు' అన్న బ్యానర్లు పెట్టారని అన్నారు.

  • Loading...

More Telugu News