: అవును సమాచారం ఇచ్చాం...తప్పా?: దిగ్విజయ్ సింగ్ ట్వీట్ పై తెలంగాణ డీజీపీ
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. ఈ మేరకు హైదరాబాదులో మాట్లాడిన ఆయన...ముస్లిం యువతను రెచ్చగొట్టామనడానికి ఆధారాలు ఇవ్వాలని సూచించారు. ఆయన ఆధారాలిస్తే...తాము కూడా విచారిస్తామని ఆయన చెప్పారు. కాన్పూర్ పేలుళ్లకు సంబంధించిన సమాచారం తామే ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. అలా సమాచారం ఇవ్వడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. తాము సమాచారం ఇవ్వకపోయి ఉంటే పేలుళ్లు జరిగి ఉండేవని ఆయన తెలిపారు. అనవసర విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ పోలీసుల సత్తా ఏంటో తమకు తెలుసని ఆయన స్పష్టం చేశారు.