: రెండు ప్రాణాలకు ఏడుగురి ప్రాణాలతో సమాధానం చెప్పిన భారత్ ఆర్మీ


జమ్ముకశ్మీర్ పూంఛ్‌ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌ నియంత్రణ రేఖ దాటి వచ్చి మరీ ఇద్దరు భారత జవాన్ల దేహాలను ఖండఖండాలుగా నరికి ఛిద్రం చేసిన పాకిస్థాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ దీటైన సమాధానం చెప్పింది. నియంత్రణ రేఖ వెంబడి కృష్ణ ఘాటీ సెక్టార్‌ కు సమీపంలో ఉన్న పాకిస్థాన్‌ కు చెందిన రెండు బంకర్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పింపల్, కిర్‌ పాన్ బంకర్లను భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఈ బంకర్లలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు పాక్ సైనికులు ప్రాణాలు కొల్పోయారు. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని, లేని పక్షంలో తీవ్ర చర్యలుంటాయని పాకిస్థాన్ కు భారత ఆర్మీ తీవ్ర హెచ్చరికలు పంపింది. 

  • Loading...

More Telugu News