: అనుకు స్వీట్ షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్


వాస్తవానికి షూటింగ్ సమయంలో పెద్దగా ఎవరితోనూ కలవడానికి ఇష్టపడని పవన్ కల్యాణ్... హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కు స్వీట్ షాక్ ఇచ్చారు. షూటింగ్ గ్యాప్ లో అనుతో సరదాగా మాట్లాడుతూ... ఆమెకు ఇష్టమైన ఆహారం 'అప్పం' అని పవన్ తెసుకున్నారు. ఆ తర్వాతి రోజు తన ఇంట్లోనే అప్పం, కూరలను తయారు చేయించి ఆమెకు పంపించారు. పవన్ ఇంటి నుంచి తనకు ఫుడ్ రావడంతో అను సర్ ప్రైజ్ అయింది. అంతేకాదు పవన్ పంపిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేసింది. తనపై ఆయన చూపిన ఆదరణను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పింది. తన స్నేహితులు, సన్నిహితులు అందరి వద్ద ఇదే విషయం గురించి చెబుతూ తెగ సంతోషపడుతోందట ఈ ముద్దుగుమ్మ.

  • Loading...

More Telugu News