: జనాల్లోకే వెళ్లి తేల్చుకోవాలనుకుంటున్న పన్నీర్ సెల్వం
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీరుపై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు గుర్రుగా ఉన్నారు. తమ డిమాండ్లను అంగీకరించకుండా ఇలాగే ముందుకు సాగితే... విలీన చర్చలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని పన్నీర్ మద్దతుదారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలనే యోచనలో పన్నీర్ సెల్వం ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, ఈ చర్చలను ఇంతటితో ముగించేసి... ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని, జనాలతో మమైకం కావాలని, తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలాన్ని పెంచుకోవాలని పన్నీర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.