: రూ. 750 కోట్ల లాభం వస్తే, రూ. 250 కోట్లు రాజమౌళికే!
బాహుబలి వసూళ్ల సునామీని సృష్టించి అత్యధిక ఆదాయాన్ని సంపాదించి పెట్టిన తొలి భారతీయ సినిమాగా ఆవిర్భవించేందుకు సిద్ధమైన వేళ, ఇంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక దిగ్గజం రాజమౌళికి నిర్మాతలు ఇస్తున్న రెమ్యూనరేషన్ ఎంత? ఈ ప్రశ్నే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశమైంది. ఐదు సంవత్సరాల కాలాన్ని వెచ్చించిన రాజమౌళికి భారీ మొత్తమే అందనున్నట్టు తెలుస్తోంది.
తన ప్రతిఫలం ఇంత అని ముందుగా ఓ మాట అనుకోకుండా లాభాల్లో మూడింట ఒక వంతును ఇచ్చేట్టుగా జక్కన్న ముందుగానే నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. అంటే, సినిమా ఖర్చులుపోగా, లాభం రూ. 750 కోట్లు మిగిలితే, అందులో రాజమౌళికి వాటా కింద రూ. 250 కోట్లు వస్తుందని సినీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఈ విషయంలో అధికారిక సమాచారాన్ని అందించేందుకు ఎవరూ ఇష్టపడకపోయినా, ఆయన పడ్డ కష్టానికి ఆ మాత్రం ప్రతిఫలం లభించాల్సిందేనని అత్యధికులు భావిస్తున్నారు.