: రోడ్డుపై ఆవులు కనిపించాయో.. యజమానులు మూల్యం చెల్లించుకోవాల్సిందే!: హరియాణా ప్రభుత్వం కొత్త రూల్స్!


హరియాణా ప్రభుత్వం సోమవారం సరికొత్త నిబంధన ఒకదానిని తెరపైకి తెచ్చింది. ఇక నుంచి ఆవులు కనుక రోడ్డుపై కనిపిస్తే వాటి యజమానులకు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిర్ణయం తీసుకున్నారు. పశువులు, ముఖ్యంగా ఆవులను రోడ్డుపై విచ్చలవిడిగా వదిలేసేవారికి ఫైన్ విధించాలని ఆదేశించారు. గోశాలలు, నందిశాలల ఏర్పాటు గురించి ప్రజలకు నొక్కి చెప్పాలని, తద్వారా పశువులను రోడ్లపైకి రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఉపయోగంలో లేని పశువుల నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను విక్రయించడం ద్వారా గోశాలలకు సొమ్ము సమకూర్చుకునే విధానం గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫలితంగా పశువులు రోడ్లపైకి రావడం తగ్గుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News