: ‘బాహుబలి’లో నటించకపోతే 'ఘాజీ'లో యాక్టు చేయడం కష్టమయ్యేది: నటుడు రానా
ఒకవేళ ‘బాహుబలి’ వంటి చిత్రంలో తాను నటించకపోయినట్టయితే ‘ఘాజీ’ వంటి ప్రత్యేకమైన సినిమాలో నటించలేక పోయేవాడినని నటుడు రానా అన్నారు. ‘బాహుబలి-2’ చిత్రం బాక్సాఫీసు రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘బాహుబలి’ చిత్రం తన మార్కెట్ విలువను పెంచిందని, విభిన్న పాత్రల్లో నటించి తాను ప్రేక్షకులను మెప్పించగలననే నమ్మకం దర్శక, నిర్మాతల్లో కలిగిందని అన్నాడు. ప్రస్తుతం తన వద్దకు విభిన్న పాత్రల్లో నటించాలని కోరుతూ ఆయా దర్శకులు వస్తున్నారని, చాలా సంస్థలు, దర్శక, నిర్మాతలు తనతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నాడు.