: దిగ్విజయ్ సింగ్ ను హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వం: మాగంటి గోపీనాథ్
తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, దిగ్విజయ్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని, ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకుంటే డిగ్గీని హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వమని, అడ్డుకుంటామని గోపీనాథ్ హెచ్చరించారు.