: జగన్ ‘బాహుబలి’.. లోకేశ్ ‘బ్రహ్మానందం’ లాంటి క్యారెక్టర్: ఎమ్మెల్యే అనిల్ కుమార్
జగన్ ‘బాహుబలి’ అయితే...లోకేశ్ ‘బ్రహ్మానందం’ లాంటి క్యారెక్టర్ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభివర్ణించారు. గుంటూరులో ‘రైతుదీక్ష’ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ కు ఏమీ తెలియదని, అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని, ఆయనకు కనీసం పేపర్ చదవడం కూడా సరిగ్గా రాదని విమర్శించారు. భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ఆ పార్టీ నాయకులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పెట్టుబడుల కోసం చంద్రబాబు అమెరికా వెళుతున్నారని తాను అనుకోవడం లేదని అన్నారు. ‘గజిని’గా మారిపోయిన చంద్రబాబు ట్రీట్ మెంట్ కోసమే అమెరికాకు వెళుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.