: వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్!
ఎప్పటికప్పుడు తన యూజర్ల ముందుకు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తూ ఆకర్షిస్తోన్న వాట్సప్ తాజాగా మరో అద్భుత ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. ‘ఫేవరెట్ చాట్’ పేరిట కొత్త ఆప్షన్‌ను తీసుకువస్తున్నట్లు వాట్సప్ ప్రతినిధులు చెప్పారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఇష్టమైన వ్యక్తిగత లేక గ్రూప్ చాట్‌ను పిన్ చేయడంతో దాన్ని టాప్‌లో ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ విధంగా యూజర్లు మూడు ఫేవరెట్ చాట్లను పిన్ చేసుకోవచ్చని వివరించారు. యాప్‌లోని టాప్ బార్లో యూజర్లకు ఈ ‘పిన్’ ఆప్షన్ కనిపిస్తుందని చెప్పారు. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.