: ‘ఇంటెలిజెన్స్’ కూడా కేసీఆర్ ఇష్టపడే విషయాలనే చెబుతోంది: టీపీసీసీ నేత ఉత్తమ్


మిర్చి రైతుల బాధలు కేసీఆర్ కు తెలియవని, కేసీఆర్ కు వాస్తవ పరిస్థితులు చెప్పే ధైర్యం మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని, ‘ఇంటెలిజెన్స్’ కూడా కేసీఆర్ ఇష్టపడే విషయాలనే చెబుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులు స్వచ్ఛందంగా ఆందోళనలో పాల్గొంటున్నారని, ‘రైతులు కాదు.. రౌడీలు’ అంటున్న ప్రభుత్వం ఆ వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని అడిగారు.

 మార్కెట్లలో రైతులతో టీఆర్ఎస్ నేతలు గొడవ పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఊహించుకున్న పరిస్థితి లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిందని, ఎన్నికలకు ఆరు నెలల ముందు టీఆర్ఎస్ నుంచి వలసలు ఉంటాయని, విద్యుత్, ప్రాజెక్టులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని అన్నారు. భారీ ప్రాజెక్టులకు ఖర్చు చేసే మొత్తాన్ని రైతులకు ఇస్తే మేలు జరుగుతుందని ఆయన సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News