: ఏపీలో భారీ వర్షాలు.. దెబ్బతిన్న మామిడి, అరటి, బొప్పాయి తోటలు
నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం, ఏలేశ్వరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు లోని పిడుగురాళ్ల, దాచేపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన వర్షం ధాటికి టి.నరసాపురం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెంలలో వందల ఎకరాల్లో మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి.