: ఇంట్లో నుంచి పారిపోయిన బాలిక జీవితాన్ని నాశ‌నం చేసిన‌ భిక్షగాళ్లు!


ఇంట్లో నుంచి పారిపోయి వ‌చ్చిన ఓ బాలిక జీవితాన్ని ప‌లువురు భిక్షగాళ్లు నాశ‌నం చేసిన ఘటన ముంబ‌యిలో చోటు చేసుకుంది. చివ‌రికి ఓ మ‌హిళ సాయంతో ఆ బాలిక త‌న త‌ల్లి వ‌ద్ద‌కు చేరి, పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... పరేల్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికకు తల్లి తిట్ట‌డంతో 2013లో ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా రైల్వేస్టేషన్ కి వెళ్లిపోయింది. అయితే, అక్క‌డ ఆ  బాలిక‌ను గుర్తించిన ఓ మ‌హిళ మాయ‌మాట‌లు చెప్పి రైల్లో తనతో తీసుకెళ్లింది. అనంతరం పుణె సమీపంలోని ఓ గ్రామానికి తీసుకొచ్చింది. ఆ రోజు రాత్రే తన బంధువైన ఓ వ్యక్తితో పెళ్లి చేసింది. ఇక, అప్పటి నుంచి ఆ బాలిక‌తో వారు భిక్షాటన చేయిస్తున్నారు.

ఊరి చివరన గుడిసెలో ఉంటూ ప్ర‌తిరోజూ ఆ బాలిక‌ను భిక్షాట‌న‌కు పంపించేవారు. ఆ బాలిక‌ను పెళ్లి చేసుకున్న వ్య‌క్తి ఆమెను శారీరకంగా హింసించి, పలుమార్లు అత్యాచారం చేశాడు. రెండేళ్ల పాటూ ఆ చీక‌టిలోనే బ‌తికిన ఆ బాలిక ఓ మ‌హిళ సాయంతో ఇప్పుడు త‌న త‌ల్లి వ‌ద్ద‌కు చేరుకుంద‌ని పోలీసులు తెలిపారు. ఆ బాలిక‌ను హించిన వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టామ‌ని, మైనర్ ను హింసించినందుకు, అత్యాచారం చేసినందుకు ఆ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష ప‌డిందని పోలీసులు చెప్పారు. ఆ వ్య‌క్తి తల్లికి, బాలికను స్టేషన్ ను నుంచి తీసుకెళ్లిన మహిళకు ఏడేళ్ల చొప్పున‌ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పుచెప్పింద‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News