: రిటైర్డ్ కల్నల్ ఇంట్లో 117 కేజీల జింక మాంసం....ఆయన కొడుకు జాతీయ షూటర్


ఆర్మీలో కల్నల్ హోదాలో పని చేసిన ఉద్యోగి నివాసంలో భారీ ఎత్తున జింక మాంసం పట్టుబడడం యూపీలో పెను కలకలం రేపుతోంది. ఈ రిటైర్డ్ కల్నల్ కుమారుడు జాతీయ షూటర్ కావడం విశేషం. జాతీయ షూటర్ ప్రశాంత్ బిష్ణోయ్ తండ్రి, రిటైర్డ్ కల్నల్ దేవేంద్ర కుమార్ తన పరపతి, పలుకుబడితో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ లోని మీరట్‌ లోని ఆయన నివాసంలో రెవెన్యూ ఇంటలిజెన్స్‌, అటవీ శాఖ (డీఆర్‌ఐ) అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో ఆయన నివాసంలో 117 కేజీల నీల్గాయ్‌ (జింక) మాంసం, 40 తుపాకులు, అత్యాధునిక కెమెరాలు, 5 జింక తలలు, జింక కొమ్ములు, చిరుత పులుల చర్మాలు, ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. వీటన్నింటితో పాటు కోటి రూపాయల నగదును కూడా ఆయన నివాసం నుంచి రెవెన్యూ, అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన కుమారుడు బిష్ణోయ్ ను విచారించామని తెలిపారు. 

  • Loading...

More Telugu News