: రాజ్యసభకు మళ్లీ రాను: సీతారాం ఏచూరి
మరోసారి రాజ్యసభకు పోటీ చేయనని రాజ్యసభ ఎంపీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టులో తన రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, రెండు దఫాలకు మించి రాజ్యసభకు ఎన్నికవ్వడానికి పార్టీ నిబంధనలు అంగీకరించవని అన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం తాను మళ్లీ రాజ్యసభకు పోటీ చేయనని స్పష్టం చేశారు.
రెండు సార్లు పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీతారాం ఏచూరి, మంచి వక్తగా పేరుతెచ్చుకున్నారు. కాగా, ఆయన మళ్లీ పోటీ చేయదలచుకుంటే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఏచూరి కావాలనుకుంటే... అవసరమైతే పార్టీ నిబంధనలను మార్చొచ్చని, సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరోల్లో చర్చించి ఆ నిబంధనను తొలగించవచ్చని ఒక సీపీఎం నేత పేర్కొనడం విశేషం.