: ‘మాయాబజార్’కు 60 ఏళ్లు.. వినూత్న షష్టిపూర్తి వేడుకకు సిద్ధమవుతున్న వికీపీడియన్లు!


మాయాబజార్.. ఈ సినిమా గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఖ్యాతిని చిరస్థాయిగా నిలిపిన ఈ సినిమాకు 60 ఏళ్లు నిండాయి. మార్చి 27, 1957న విడుదలైన మాయాబజార్ చిత్రం ఇప్పుడు షష్టి పూర్తి వేడుకలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సినీ ప్రేక్షకులు, వికీపీడియాలో రాసేవారు (వీకిపీడియన్లు) సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఖ్యాతిని ఇంటర్నెట్ ద్వారా మరింత వ్యాప్తి చేసేందుకు తయారవుతున్నారు.

వచ్చే వారం రోజులపాటు మాయాబజార్‌పై ప్రత్యేకంగా వ్యాసాలు రాయడంతోపాటు, ఇప్పటికే ఉన్న వ్యాసాలకు మెరుగులు దిద్దేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ‘మాయాబజార్‌కు ప్రేమతో తెవికీ’ పేరుతో ‘మాయాబజార్’ అభిమానులు, తెలుగు వికీపీడియన్లు సమావేశమయ్యారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయాబజార్ సినిమా విశేషాలను ఇంటర్నెట్ ద్వారా భద్రపరచాలనుకోవడం గొప్ప విషయమన్నారు. సినీ రచయిత మోహన్ రావిపాటి మాట్లాడుతూ మాయాబజార్ సినిమా ప్రేక్షకులకు విందు భోజనం లాంటిదన్నారు.

  • Loading...

More Telugu News