: పోలీసుల అదుపులో హరీశ్ రావు
బయ్యారం గనులపై మెదక్ సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్ధిపేటలో టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే హరీశ్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బస్ డిపో ఎదుట నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు హరీశ్ రావుతోపాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.