: పవన్ కల్యాణ్ మంచోడు.. రాజకీయాలకు పనికి రాడు: ఏపీ మంత్రి సోమిరెడ్డి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంచి మనిషని, కానీ, రాజకీయాలకు అంతగా పనికిరాడని తన అభిప్రాయమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను పెట్టుబడులు పెట్టలేను.. ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదు అంటూ పవన్ కల్యాణ్ అంటుంటారు. ఇది పొలిటీయన్ కు పనికి రాదు. స్ట్రాంగ్ గా ఉండాలి. మనిషి మంచివారు..ప్రజల మంచి కోరుకుంటారు... పవన్ ఇచ్చిన సలహాలను అవసరమైతే మా ప్రభుత్వం కూడా స్వీకరిస్తోంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి పవన్ కల్యాణ్ ఎప్పుడూ విమర్శించలేదు. ఎక్కడైనా తప్పులుంటే పవన్ చెబుతున్నారు. దాని వల్ల సంబంధిత మంత్రి, శాఖ యాక్టివ్ అవుతున్నారు. ఏదేమైనా, పవన్ కల్యాణ్ గారు లోపలొకటి పెట్టుకునే వ్యక్తి కాదు .. స్ట్రాటజిస్ట్ అయితే కాదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఏమవుతుందో చూస్తాము’ అని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.