: రెడ్డిని రెడ్డే తిట్టాలన్న నిబంధనేదీ టీడీపీలో లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల్లో నుంచి బయటపడే ప్రసక్తే లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జగన్ పై అడిషనల్ ఛార్జి షీట్ సహా పన్నెండు కేసులు ఉన్నాయని, ఈ కేసులన్నింటికీ సంబంధించి ఆధారాలు ఉన్నాయని, వీటి నుంచి బయట పడటమనే ప్రసక్తే లేదని అన్నారు. తాను ఎవరినీ ఎదగనీయననే మాటల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఆ కల్చర్ టీడీపీలో లేదని, తనకు మంత్రి ఇవ్వొద్దని నెల్లూరులో ఎవరూ వ్యతిరేకించలేదని, జగన్ ను తిట్టేందుకే తన కెరీర్ పరిమితం కాలేదని, రెడ్డిని రెడ్డే తిట్టాలన్న నిబంధనేదీ టీడీపీలో లేదని ఆయా ప్రశ్నలకు సమాధానాలుగా సోమిరెడ్డి చెప్పారు.  

  • Loading...

More Telugu News