: జగన్ ఎన్ని నాటకాలు ఆడినా రైతులు నమ్మరు: ప్రత్తిపాటి పుల్లారావు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎన్ని నాటకాలు ఆడినా రైతులు నమ్మే స్థితిలో లేరని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,‘జగన్ కు రైతు దీక్ష చేసే నైతికహక్కు లేదు. గతంలో రుణమాఫీని వ్యతిరేకించింది వైఎస్ కాదా? గత ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీని జగన్ ఎందుకు చేర్చలేదు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రైతులకు నమ్మకం కలిగింది. రుణమాఫీ, పట్టిసీమ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశాం. రైతులకు మేలు జరగడం జగన్ కు ఇష్టం లేదు. మిర్చికి అదనపు ధర రూ.1500 ఇచ్చిన ఘనత టీడీపీదే. మిర్చి రైతులకు పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా ఇస్తున్నాము’ అని పుల్లారావు అన్నారు.