: ‘జగన్, వాట్ మోర్ యు వాంట్?’ : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


ఇతర రాష్ట్రాలతో ఏపీలో రైతులకు మెరుగైన పరిస్థితులు ఉన్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వైఎస్సార్సీపీ అధినేత జగన్ దీక్ష చేపట్టే ముందు ఓ విషయం ఆలోచించాలి. ఈ రోజు ఏ పంటకు అయినా.. వరి, మిర్చి, పసుపు, కందులు ఇలా ఏ పంటకైనా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ధరల కంటే ఏపీలో ఎక్కువ ధరలు ఉన్నాయా? లేవా? ఆంధ్రప్రదేశ్ లో రైతులకు జరుగుతున్న కొరత ఏంటి? రైతులకు ఏడు గంటల పాటు విద్యుత్ ఇస్తున్నాము.

వ్యవసాయ బడ్జెట్ పెంచాము. ఇరిగేషన్ లో దోపిడీ కార్యక్రమాలకు చెక్ పెట్టాము. ‘నీరు-ప్రగతి’, ‘నీరు-చెట్టు’... భారతదేశంలో ఒక మోడల్ గా ఏపీని చేస్తున్నాము. జగన్.. ‘వాట్ మోర్ యు వాంట్?’...ఆరు నెలలకోసారి, నేను కూడా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునేందుకు.. ప్రజలు మర్చిపోకుండా ఉండేందుకు జగన్ నిరాహార దీక్ష చేస్తున్నాడు’ అని సోమిరెడ్డి మండిపడ్డారు. కాగా, రైతులకు రుణమాఫీ అమలు కాకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడాన్ని నిరసిస్తూ జగన్ రేపటి నుంచి గుంటూరులో దీక్ష చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News