: చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసగిస్తోంది!: వైఎస్సార్సీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి


ఇంకుడు గుంతల పేరుతో  ఏపీలో రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరవు పరిస్థితులను తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరవు నివారణ చర్యలు చేపట్టి రైతులకు ఉపాధి మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. కరవు బారిన పడుతున్న రైతులు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని అన్నారు. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా పెండింగ్ పనులను, డిస్ట్రిబ్యూటరీలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆయకట్టు ద్వారా రైతులకు నీరు ఇవ్వాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News