: పోలీసుల విచారణకు హాజరైన ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్


ఏపీ శాసనమండలిపై అభ్యంతరకర పోస్టులు చేసిన ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్  రెండోసారి పోలీసు విచారణకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసుల సమక్షంలో విచారణ జరుగుతోంది. రవికిరణ్ ‘పొలిటికల్ పంచ్’ ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన చిత్రాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ లను పోలీసులకు అందజేశాడు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ, విశాఖపట్టణంలో ఎమ్మెల్యే అనిత తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News