: స్పీకర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు... మార్షల్స్ రంగ ప్రవేశం


ఈ ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్షాల ఆందోళన మధ్య బిల్లుకు నిమిషాల వ్యవధిలో ఆమోదం పడగా, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించిన కాంగ్రెస్ సభ్యులు సభను వీడేందుకు ససేమిరా అంటూ లోపలే ఉండిపోయారు. సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే, ఆయన బయటకు వెళ్లకుండా చుట్టుముట్టి ఘెరావ్ చేశారు.

దీంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మార్షల్స్ కు, కాంగ్రెస్ సభ్యులకూ మధ్య తోపులాట జరుగగా తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మార్షల్స్ సాయంతో స్పీకర్ బయటకు వెళ్లిపోగా, ఆపై కాసేపటికి కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి, తమ కార్యాలయంలో సమావేశమై, తదుపరి అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News