: బాహుబలి నిర్మాత ఔదార్యం చూపి.. ఆ పిచ్చికి చికిత్స చేయించాలి: రాంగోపాల్ వర్మ


'బాహుబలి: ది కన్ క్లూజన్' ఓ చెత్త సినిమా అని, దీని కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన వేళ, ఆయన పేరును ప్రస్తావించకుండా దర్శకుడు రాంగోపాల్ వర్మ విరుచుకుపడ్డాడు. "బాహుబలి-2 చిత్రం నచ్చని వారిని చూసి జాలి పడుతున్నా. అతను లేదా ఆమెకు మానసిక చికిత్స అవసరం. చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ ఔదార్యం చూపి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును భరించాలని నా మనవి" అని ట్వీట్ పెట్టాడు. తనకు కూడా బాహుబలి-2 'జలసైటిస్' జబ్బు పట్టుకుందని, ఆసుపత్రిలో చేరానని, మరెంతో మంది చిత్ర నిర్మాతలు సైతం చికిత్స పొందుతున్నారని అన్నాడు.

  • Loading...

More Telugu News