: రేప్ కేసులో మాజీ మంత్రి ప్రజాపతికి బెయిలిచ్చారని జడ్జిని తొలగించిన హైకోర్టు


రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతికి బెయిలు మంజూరు చేసిన అడిషనల్  సెషన్స్ జడ్జి ఓం ప్రకాశ్ మిశ్రాను అలహాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. అంతేకాక జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ మాజీ మంత్రి ప్రజాపతికి బెయిలు మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్ ను రద్దు చేసినట్టు చీప్ జస్టిస్ దిలీప్ బి.భోసాలే తెలిపారు. ఓ మహిళను రేప్ చేయడమే కాక, ఆమె మైనర్ కుమార్తెపైనా అత్యాచారానికి ప్రయత్నించినట్టు ప్రజాపతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మంగళవారం పోస్కో కోర్టు స్పెషల్ జడ్జి ఓం ప్రకాశ్ మిశ్రా ప్రజాపతికి బెయిలు మంజూరు చేశారు.

  • Loading...

More Telugu News