: తమిళ మంత్రుల మెడకు చుట్టుకున్న ఉచ్చు... తొలుత 15 మందికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు!


దినకరన్ కేసు ఇప్పుడు తమిళనాడు మంత్రులకు చుట్టుకుంది. పలు ప్రాజెక్టు కాంట్రాక్టులను అప్పగించడం ద్వారా ముడుపులను తీసుకుని వాటిని ఈసీకి లంచంగా ఇచ్చేందుకు నిర్ణయించుకుని, దినకరన్ కు అప్పగించారని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సాక్ష్యాలను సంపాదించినట్టు తెలుస్తోంది. తొలి దశలో 15 మంది మంత్రులకు నోటీసులు ఇచ్చి, వారిని ప్రశ్నించేందుకు పోలీసులు కదులుతున్నట్టు సమాచారం. ఇప్పటికే నోటీసులు సిద్ధమయ్యాయని, వాటిని నేడో, రేపో బట్వాడా చేయవచ్చని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈసీకి రూ. 50 కోట్లను లంచంగా ఇచ్చేందుకు బేరాలు సాగిన ఈ కేసులో రూ. 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో పోలీసులకు తెలిసిపోగా, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేనున్నారన్న కోణంలో విచారణ సాగుతోంది. పోలీసుల విచారణతో బెంబేలెత్తిపోతున్న తమిళనాడు మంత్రుల్లో 20 మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వీరందరికీ కేసులో ఏదో ఓ రూపంలో సంబంధం ఉండి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు, వారెక్కడ ఉన్నారన్న విషయమై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News