: మరోసారి శిల్పా సోదరులను పిలిచిన చంద్రబాబు... మరికాసేపట్లో భేటీ


నంద్యాల ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ టికెట్ తమకు దక్కాలంటే, తమకు దక్కాలని భూమా అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి గట్టిగా వాదిస్తున్న వేళ, సమస్యను కొలిక్కి తెచ్చేందుకు ఇప్పటికే పలు దఫాలుగా వారితో చర్చించిన సీఎం చంద్రబాబునాయుడు, నేడు మరోసారి వారితో మాట్లాడనున్నారు. తనను కలవాలని శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలతో పాటు, మాజీ మంత్రి ఫరూక్ లను ఆయన పిలిచారు.

మరికాసేపట్లో వీరిమధ్య భేటీ జరగనుంది. నిన్న భూమా, శిల్పా వర్గాలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమైనప్పటికీ, నంద్యాల సీటు విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన సమసిపోలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం మరోసారి వీరిని పిలిపించడం గమనార్హం. ఈ భేటీ తరువాత టికెట్ ఎవరికి దక్కుతుందన్న విషయంలో కొంత స్పష్టత రావచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News