: రెఫరెండం పెట్టండి... ఇండియాకే మా ఓటు: నినదిస్తున్న గిల్గిత్ - బాల్టిస్థాన్


తమ ప్రాంతంలో పాక్ సైనికుల దురాగతాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రెఫరెండం నిర్వహిస్తే పెద్దఎత్తున ప్రజలు పాకిస్థాన్ ను వ్యతిరేకించి ఇండియాకు ఓటేస్తారని గిల్గిత్‌ - బాల్టిస్థాన్‌ నేత అబ్దుల్‌ హమీద్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో భాగంగా ఉన్న గిల్గిత్‌ లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

చైనా నిర్మిస్తున్న చైనా-పాక్‌ ఎకనామిక్ కారిడార్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నా, సైన్యం అండతో నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని ఆరోపించారు. పాక్‌ ప్రభుత్వంలా ఇండియా దురాగతాలకు పాల్పడదని విశ్వసిస్తున్నామని అన్నారు. తమ అనుమతి లేకుండా సీపీఈసీని ఎలా చేపడతారని ప్రశ్నించారు. కాగా, వివాదాస్పద ప్రాంతంలో చేపట్టిన ఈ ప్రాజెక్టును ఇండియా కూడా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News