: గుర్రంపై పెళ్లికొడుకు... ఒక్కసారిగా పరుగు తీసిన గుర్రం.. ఆ వెనుకే పరుగు తీసిన బంధువులు!


పెళ్లి వేడుకలో వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ బరాత్‌ నిర్వహిస్తుండ‌గా ఒక్క‌సారిగా బెదిరిపోయిన ఆ గుర్రం అక్క‌డి నుంచి దూరంగా ప‌రుగు తీసింది. ఆ గుర్రంపైనే ఉన్న పెళ్లి కొడుకు ఎక్క‌డికో వెళ్లిపోయాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ష్రిగొండలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. డీజే సౌండ్ పెట్టి సంప్రదాయం ప్రకారం బరాత్‌లో గుర్రంపై వ‌రుడిని కూర్చోబెట్టిన‌ ట్రైనర్‌ శిక్షణ ఇస్తున్నాడు. కొద్దిసేపు గుర్రంతో విన్యాసాలు చేయించాడు. అయితే, ఒక్క‌సారిగా గుర్రం అక్కడి నుంచి దూరంగా పరుగుతీసింది. గుర్రంపైనే వ‌రుడు ఉండ‌డంతో అక్క‌డ ఉన్న బంధువులంతా గుర్రం వెనుకాలే పరుగు తీశారు. చివ‌రికి ఏమైంద‌నే విష‌యం మాత్రం తెలియ‌రాలేదు. ఈ ఆసక్తికర వీడియోను మీరూ చూడండి...

  • Loading...

More Telugu News