: పరాభవాల పరంపర... ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ సేనకు ఏడో ఓటమి
ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏ మాత్రం రాణించలేపోతోంది. ఈ రోజు రైజింగ్ పుణె సూపర్ తో జరిగిన మ్యాచులోనూ కోహ్లీ సేన ఘోరంగా ఓటమిని చవిచూసి, ఈ సీజన్లో ఏడో ఓటమిని మూటగట్టుకుంది. ఈ రోజు జరిగిన ఆటలో ముందుగా బ్యాటింగ్ చేసిన పుణె 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేన ఏ మాత్రం రాణించలేకపోయింది. 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 96 పరుగులకే పరిమితమైంది.