: బర్త్ డే కేక్ కట్ చేస్తూ సందడి చేసిన సమంత.. మీరూ చూడండి!
నిన్న చెన్నై బ్యూటీ సమంత తన పుట్టినరోజు వేడుకని ఎంతో హుషారుగా జరుపుకుంది. బర్త్డే కేక్ కోస్తున్న సమయంలో సందడి చేసింది. ఈ పార్టీకి వెళ్లిన వారు తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి అక్కడ దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. చాలా సంతోషంగా, సరదాగా పార్టీ జరిగిందని చెప్పింది. ఈ పార్టీకి వచ్చిన వారంతా సమంతకు హ్యాపీ బర్త్ డే చెప్పి, హుషారుగా గడిపారు. పార్టీకి వచ్చినవారికి సమంత ధన్యవాదాలు చెప్పింది. సమంత కేక్ కట్ చేస్తున్న వీడియోను మీరూ చూడండి..
Birthday celebrations @Samanthaprabhu2 @chay_akkineni pic.twitter.com/dGz1uhogci
— Samantha Prabhu FC (@SamanthaFanzzz) 29 April 2017