: విద్యాసాగర్‌ రావు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి


సాగునీటి రంగ నిపుణుడిగా విశేష సేవలు అందించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు(77) ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయన మృతి ప‌ట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహ‌న్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సాగునీటి రంగ నిపుణుడిగా, సలహాదారుగా ఆయ‌న‌ అందించిన సేవలు చిరస్మరణీయమని జ‌గ‌న్ పేర్కొన్నారు. విద్యాసాగ‌ర్ రావు ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. కాగా, విద్యాసాగర్ రావు అంత్య‌క్రియ‌ల‌ను రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో నిర్వ‌హించ‌నున్నారు.

  • Loading...

More Telugu News