: అంగారకుడిపై మీ పేరు కావాలా?


అంగారకుడిపై మీ పేరుండాలని కోరుకుంటున్నారా...? అయితే నాసా మీకో అవకాశం ఇస్తోంది. పేరు ఉంటే చాలనుకుంటే పేరు, లేదా మూడు పాదాలు మాత్రమే ఉండే పద్యాలు (హైకూలు) కూడా పంపాలనుకుంటున్నారా? అయితే వాటినీ కూడా నాసాకు పంపితే వాటిని ఒక డివీడీలో వేసి అంతరిక్షంలోకి తీసుకెళ్లి అరుణగ్రహంలోకి చేరవేస్తుంది.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ ఏడాది నవంబరులో 'మార్స్‌ అట్మాస్ఫియర్‌ అండ్‌ వోలటైల్‌ ఎవల్యూషన్‌' (మావెన్‌) అనే వ్యోమనౌకను అరుణగ్రహంపైకి ప్రయోగించనుంది. దీనిద్వారా ఆ గ్రహంలోని వాతావరణాన్ని గురించి పరిశోధించనుంది. అయితే ఇక్కడ మరో విశేషమేమంటే, ఈ వ్యోమనౌకలో ఒక డీవీడీని కూడా అరుణ గ్రహంపైకి నాసా పంపుతుంది. సదరు డివీడీలో తమ పేర్లు, సందేశాల రూపంలో తాము రాసిన హైకూలు కూడా ఉండాలని కోరుకునే ఔత్సాహికులు వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా జూలై 1లోగా పంపాల్సి ఉంటుంది. డీవీడీలో ఉంచే మూడు హైకూలను జూలై 15 నుండి ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. మరో విషయమేంటంటే, ఈ కార్యక్రమంకోసం పేర్లను పంపేవారికి మావెన్‌ యాత్రలో వారి భాగస్వామ్యాన్ని నిర్ధారించే ప్రశంసా పత్రం కూడా అందజేస్తారు. కాబట్టి అంతరిక్ష అన్వేషణలో భాగం కావాలనుకుంటున్న వారంతా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

  • Loading...

More Telugu News