: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై ఫేస్‌బుక్ లో పోలీసధికారి అభ్యంతరకరమైన పోస్టు.. అరెస్టు


అసోం పోలీస్ శాఖకు చెందిన డీఎస్పీ ఒకరు తన ఫేస్‌బుక్ ఖాతాలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న ఏకంగా బీజేపీ మహిళా ఎమ్మెల్యేపైనే కామెంట్లు చేయ‌డంతో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. అసోం అధికార బీజేపీకి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, డీఎస్పీ అంజన్‌ బోరా ఇటీవల అందులో ఒక మహిళా ఎమ్మెల్యేను ఇంటిపేరుతో సంబోధిస్తూ ఓ అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దీంతో బీజేపీ నేతలు ఈ పోస్టుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించి, నేరపూరిత అభియోగాల కింద ఈ రోజు అరెస్టు చేశారు. అంజన్‌ బొరా గతంలోనూ ఇటువంటి పోస్టులే చేసి, సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు.

  • Loading...

More Telugu News