: మీ ప్రేమ, అభిమానాలు లేకపోతే నేను ఇక్కడుండేదాన్ని కాదు: రమ్యకృష్ణ
'బాహుబలి-2' ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శివగామి రమ్యకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన వారందరికీ రమ్యకృష్ణ థ్యాంక్స్ చెప్పింది. "ఫోన్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా అభినందనలు తెలిపిన వారందరికీ బిగ్ థ్యాంక్స్. మీ అందరి ప్రేమ, అభిమానం లేకపోతే... ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు" అంటూ ట్వీట్ చేసింది.