: ముస్లిం మ‌హిళ‌ల‌కు కూడా స‌మాన హ‌క్కులు క‌ల్పించాలి: ప్రధాని మోదీ


తలాక్.. తలాక్.. తలాక్ అని చెప్పేసి, భార్యను వ‌దిలించుకొని, మ‌రొక‌రిని వివాహం చేసుకునే ప‌ద్ధ‌తిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మ‌రోసారి స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ... ఈ అంశాన్ని రాజ‌కీయ కోణంలో చూడ‌కూడ‌ద‌ని, ముస్లిం మ‌హిళ‌ల‌కు కూడా స‌మాన హ‌క్కులు క‌ల్పించాల‌ని అన్నారు. ఇటువంటి చెడు ప‌ద్ధ‌తుల నుంచి ముస్లిం మ‌హిళ‌ల‌ను ర‌క్షించుకునే సంస్క‌ర‌ణ‌ల‌కు ముస్లిం మ‌త‌పెద్ద‌లు దారులు వెతుకుతార‌ని ఆయ‌న ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లిం సోద‌రీమ‌ణుల‌కు న్యాయం క‌ల్పించాల‌నే ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఉద్దేశ‌మ‌ని బీజేపీ నేత‌లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News