: వేస్ట్ సినిమా, శుద్ధ దండగ... ప్రభాస్, రాజమౌళిలను ఏకేసిన కమల్ ఆర్ ఖాన్
యావత్ సినీ ప్రపంచం వేనోళ్ల పొగుడుతున్న 'బాహుబలి-2' చిత్రంపై బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ ఓ ఒంటెలా కనిపిస్తున్నాడని, ఆయన్ను ఎవరైనా హిందీ నిర్మాతలు తమ చిత్రాల్లో తీసుకుంటే ఇడియట్సేనని చెలరేగిపోయాడు. ఈ చిత్రంలో కథ లేదని, గ్రాఫిక్స్ ఘోరమని, రాజమౌళి దర్శకత్వం బాగాలేదని, సంగీతం పరమ చెత్తని అన్నాడు.
వాస్తవానికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఈ చిత్రం చూస్తున్న ప్రేక్షకులను డిస్ట్రబ్ చేస్తుందని, దీన్ని చూడటం శుద్ధ దండగని చెప్పాడు. చూసేందుకు వెళ్లేవారి డబ్బు, సమయం వృథా అయినట్టేనని అన్నాడు. తొలి భాగంతో పోలిస్తే పదో వంతు కూడా ఇందులో లేదని, అసలు మూడు గంటల పాటు నిడివి కొనసాగించాల్సిన అవసరమే లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, నటీనటులు బాగా చేశారని కితాబిస్తూ, 5కు గాను 1 రేటింగ్ ఇచ్చాడు.