: ఫిలిప్పైన్స్ లో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ


పసిఫిక్ మహా సముద్రంలో 'రింగ్ ఆఫ్ ఫైర్'గా పిలువబడే ప్రమాదకర ప్రాంతంలో ఉన్న ఫిలిప్పైన్స్ లో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.8 మ్యాగ్నిట్యూడ్ తో రికార్డయినట్టు అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో పలు పెద్ద భవనాలకు బీటలు పడ్డాయని తెలిపారు. ఫిలిప్పైన్స్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:23 గంటల సమయంలో భూకంపం వచ్చిందని, ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారని తెలిపారు.

భూకంపం ప్రభావం ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలను జారీ చేశామని, తీర ప్రాంతాల ప్రజలను దూరంగా వెళ్లాలని తెలిపామని అన్నారు. ఓ ఆసుపత్రి, రెండు ప్రభుత్వ భవనాలు, ఓ నాకాశ్రయ భవనానికి బీటలు పడ్డాయని, ఓ ఇల్లు కుప్పకూలిందని, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయని అన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News