: లారీ, కారు ఢీ ముగ్గురి మృతి
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు వద్ద నేటి తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణిలో పని చేస్తున్న ముగ్గురు స్నేహితులు ఖమ్మంలోని ఒక వివాహమహోత్సవానికి హాజరయ్యారు. ఈ ముగ్గురుని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. వివాహం ఆనందంలో వేగంగా వస్తూ లారీని ఢీ కొట్టారు. దీంతో ఈ ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతిగా మద్యం తీసుకోవడం, లేదా నిద్రమత్తులో ఈ ఘటన జరిగి ఉంటుందని అక్కడి వారు వ్యాఖ్యానించడం విశేషం.