: కేసీఆర్ అవినీతిపై పుస్తకం విడుదల చేస్తాం!: మధు యాష్కీ


కేసీఆర్ అవినీతిపై పుస్తకం విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని, ఇదే విషయాన్ని కేటీఆర్ కు లేఖ రాసిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ అని, అమరుల కుటుంబాలకు కేసీఆర్ కనీసం పరిహారం ఇవ్వలేదని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ ఆస్తులన్నీ కొల్లగొట్టారని మధు యాష్కీ ఆరోపించారు.

  • Loading...

More Telugu News