: ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ పై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు


‘పొలిటికల్ పంచ్’లో అభ్యంతరకర పోస్ట్ పెట్టారంటూ విశాఖపట్టణం త్రీ టౌన్ పోలీసులకు అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. దీంతో ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఈమేరకు మే 4వ తేదీన విచారణకు హాజరు కావాలని రవికిరణ్ కు పోలీసులు నోటీసులు పంపారు. కాగా, పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజీలో శాసన మండలిపై అసభ్యంగా పోస్టు చేసిన ఆరోపణలపై రవికిరణ్ ను ఈ నెల 22వ తేదీన పోలీసులు విచారణకు తీసుకువెళ్లి, ఆ మర్నాడు విడుదల చేసిన విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News